Site icon NTV Telugu

Exclusive : ఇంకెన్నాళ్లు.. రాడ్ రంబోలా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్న నితిన్

Nithiin

Nithiin

యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ తో నితిన్ పేరు మారు మోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరు ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ప్లాప్ చూసాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.

Also Read : Thammudu : తమ్ముడు ఓవర్శీస్ రివ్యూ..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. అయినా సరే హిట్ కోసం పోరాడుతూ 2012లో ఇష్క్ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ‘అఆ’ హిట్ తర్వాత తర్వాత  2016 నుండి  2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్.   ఛల్ మోహన రంగ కాస్త పరవాలేదు. మిగిలిన సినిమాలు వేటికవె పోటాపోటీగా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన తమ్ముడు కూడా మిశ్రమ స్పందన రాబట్టింది. ఇవన్నీ చూస్తుంటే నితిన్ కథల ఎంపిక ఎంత దారుణంగా ఉందొ అర్ధం అవుతోంది.

Also Read : Tollywood : తెలుగులో సెటిలైపోయిన పరభాష స్టార్ హీరో

తమ్ముడు ఓపెనింగ్ షోస్ ఫుల్స్ లేవంటే సిచుయేషన్ ఏంటో ఆయనకే తెలియాలి. అసలు నితిన్ కథలు ఎవరు వింటున్నారో అనే డౌట్ రాక మానదు. టాలివుడ్ లో వినిపించే దాన్ని బట్టి నితిన్ చుట్టూ ఉండే కోటరీ వలెనే ఆయనకు ప్లాప్స్ అనే టాక్  ఉంది. తొలి సినిమాతో భారీ హిట్ కొట్టి ఇప్పుడు హిట్ కోసం అల్లాడిపోతున్నాడు అంటే తప్పు ఎక్కడ జరుగుతుందో  నితిన్ తెలుసుకోవాలి. యాక్టింగ్, కామెడీ టైమింగ్ అన్ని ఉండి కూడా నితిన్ దారుణ పరాజయాలు చూస్తున్నాడు. ఆ మధ్య మాస్ మాస్ అని జపం చేసి ప్లాప్స్ రావడంతో లవ్ స్టోరీస్ చేసి హిట్ కొట్టాడు. ఆఆ తర్వాత ఆ కథలకు స్వస్తి చెప్పి ఏవేవో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రం తమ హీరో ఈ సినిమాతో హిట్టు కొట్టకపోతాడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ నితిన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో రాడ్ రంబోలా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాడు. ఈ ప్లాప్ ల పరంపర ఇలాగె కొనసాగితే నితిన్ కనుమరుగు అయిపోయిన టాలీవుడ్ హీరోల లిస్ట్ లో చేరడం ఖాయం.

Exit mobile version