ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’ లో సీనియర్ నటుడు నరేశ్ తో పాటు జిషుసేన్ గుప్తా కీలక పాత్ర పోషించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ‘మాస్ట్రో’ కోసం క్రేజీగా ఎదురుచూస్తున్న కుర్రకారు… నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంతో కాస్తంత నిరాశకు గురి కావడం ఖాయం!
‘మాస్ట్రో’ సైతం వెనక్కి!

Nithiin's Maestro Movie OTT New Release Date