Spy : నిఖిల్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ… టాస్క్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “18 పేజెస్”, “కార్తికేయ 2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. భారీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిఖిల్ చేతిలో షాట్‌గన్ పట్టుకుని, సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కాగా “స్పై” మూవీతో నిఖిల్ పాన్ ఇండియా రేసులోకి అడుగు పెడుతుండడం విశేషం. ‘స్పై’ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ దసరా కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Read Also : Sanjay Dutt : డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలేనట !!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
నిర్మాత కె రాజ శేఖర్ రెడ్డి కథ అందించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ‘స్పై’ థ్రిల్లర్‌లో అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
The sentinel is geared up for the Task!
Unfolding & Presenting 𝐒𝐏𝐘🔥#SPY ATTACKING PAN INDIAN THEATRES this DASARA 2022😎స్పై – स्पाई – ஸ்பை – ಸ್ಪೈ – സ്പൈ@Ishmenon @Garrybh88 @AbhinavGomatam @tej_uppalapati @julian_amaru #EDEntertainments #KRajashekarreddy pic.twitter.com/MBRlUsb7it
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 17, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!