Site icon NTV Telugu

Nikesha Patel : ఏ మెగా స్టార్ గురించి మాట్లాడుతున్నారు ? నెటిజన్ కు పవన్ హీరోయిన్ ప్రశ్న

Nikesha Patel

Nikesha Patel

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కొమరం పులి” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీ నికిషా పటేల్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కన్పించని ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “ఏ మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నారు ?” అని ఈ భామ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశం తనకు మెగాస్టార్ ఎవరో తెలియదు అని చెప్పడం కానప్పటికీ, మెగా అభిమానులు మాత్రం మండిపడుతున్నారు.

Read Also : Samantha : టాటూలపై సామ్ షాకింగ్ కామెంట్స్

మహేష్ బాబు “ఫెయిర్ అండ్ లవ్లీ” అని, ధనుష్ ఫేవరెట్ యాక్టర్ అని, పవన్ గడ్డం ఇష్టమని, ప్రభాస్ మంచి ఫ్రెండ్ అని, కాకపోతే పొడుగు ఎక్కువని నెటిజన్ల ప్రశ్నలకు వన్ లైన్ ఆన్సర్ ఇచ్చిన నికిషాకు మెగాస్టార్ గురించి చెప్పండి ? అనే ప్రశ్న ఎదురైంది. “ఏ మెగాస్టార్ గురించి ?” అంటూ ప్రశ్నించింది నికిషా. దీంతో అందుకే ఈ అమ్మడికి సినిమాల్లో ఛాన్సులు రావట్లేదని, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన నీకు మెగాస్టార్ ఎవరో తెలీదా? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే నికిషా అభిమానులు మాత్రం చిరు, మమ్ముట్టి, సల్మాన్ ఖాన్ లు కూడా మెగాస్టార్లే… అందులో ఎవరి గురించి అని అడిగింది అంటూ ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇక తనకు వరుడు దొరికాడని, త్వరలోనే యూకే అబ్బాయితో పెళ్లి పీటలేక్కబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించింది నికిషా.

Exit mobile version