Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార పరంగా మరో సంచలన అడుగు వేశారు. సాధారణంగా నిర్మాతలు తమ సినిమాల ఆడియో హక్కులను బయటి మ్యూజిక్ లేబుల్స్‌కు అమ్మేస్తుంటారు. కానీ, ఆ సంప్రదాయానికి చెక్ పెడుతూ నిహారిక స్వయంగా ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో సొంత ఆడియో ఛానెల్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2015లో ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక, ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘బెంచ్ లైఫ్’ లాంటి హిట్ ప్రాజెక్ట్స్‌తో పాటు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘రాకాస’ సినిమాలతో నిర్మాతగా సక్సెస్ అయ్యారు. పదేళ్ల ఈ ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతున్న ఆమె, ఇప్పుడు సొంత మ్యూజిక్ లేబుల్‌తో బడా ఆడియో సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ సంస్థ వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో చేతులు కలిపి ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడం విశేషం.
ఈ సొంత మ్యూజిక్ ఛానెల్ నుంచి రాబోతున్న మొదటి ఆల్బమ్‌గా ‘పాకెట్ రాకెట్స్’ పాటలను విడుదల చేయనున్నారు. గ్యాని సంగీతం అందించిన ఈ హై-ఎనర్జీ ఆల్బమ్ త్వరలోనే శ్రోతల ముందుకు రాబోతోంది. నిహారిక సమర్పణలో, రుద్ర ఆత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక ఆసక్తికరమైన అర్బన్ డ్రామాగా రూపొందుతోంది.
జీవితంలో త్వరగా ఎదగాలనే ఆశతో అంజి, యేసు అనే ఇద్దరు యువకులు జూద ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. త్రినాధ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతం, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. మరి నిర్మాతగా నేషనల్ అవార్డు కొట్టిన నిహారిక, ఈ కొత్త మ్యూజిక్ బిజినెస్‌లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
-
UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
-
West Bengal: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు.. ఇకపై ‘‘పశ్చిమ బంగా’’
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!