Site icon NTV Telugu

Raid At Pudding & Mink Pub : రాత్రి నుంచి స్టేషన్ లోనే నిహారిక

Niharika

Niharika

హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్‌ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో భారీ రేవ్‌ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్‌ వాడినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు పబ్ నిర్వహించిన పబ్ యజమానిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కాగా విచారణ అనంతరం కొందరిని విడుదల చేయగా, ప్రస్తుతం 38 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే తమను అరెస్ట్ చేశారంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పబ్ లో డ్రగ్స్ వాడినట్టు కూడా వెల్లడైంది.

Read Also : Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !

ఇదిలా ఉండగా ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉండడం సంచలనానికి దారి తీసింది. పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ లో రాత్రి జరిగిన పార్టీలో నిహారిక కూడా పాల్గొంది. అయితే రాత్రే వీరందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అప్పటి నుంచి నిహారిక అక్కడే ఉన్నట్టు సమాచారం. ఆ తరువాత పేరెంట్స్ ని పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం నిహారిక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామికవేత్తల పిల్లలు ఉండగా, అందులో కొందరి వద్ద నుంచి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

 

Exit mobile version