PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఇటీవల థియేటర్ రెంట్ vs పర్సెంటేజ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిర్మాతలు వర్గం, ఎగ్జిబిటర్స్ వర్గం రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఆ ప్రభావం ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’పై పడుతుందని బావించారు. కానీ పర్సెంటేజ్ విధానంపై అందరు ఒకేమాటపై ఎలాంటి అడ్డంకులు లేకుండా పెద్ది రిలీజ్ కు సహకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది భారీ ఎత్తున రిలీజ్ అయింది.
అయితే ఇప్పుడు ‘పెద్ది’ పర్సెంటేజీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నైజాంలో పెద్ది టికెట్ల ధరల పెంపుదల ద్వారా వచ్చే వసూళ్లలో ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఒప్పందంపై ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు స్పందిస్తూ ‘అసలు ఈ 7.5 శాతం అదనపు వాటా హామీ గురించి తనకు అసలు సమాచారమే లేదు, తన అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల ఈ విషయాలు నా దృష్టికి రాలేదని, అందువల్ల ఈ కమిట్మెంట్ను తాను అంగీకరించలేనని లేఖ విడుదల చేశారు.
Also Read
నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలపై ఫిలిం ఛాంబర్ గట్టిగానే కౌంటర్ ఇస్తూ ‘ఈ వ్యవహారానికి సంబంధించి మే 27వ తేదీనే సదరు నిర్మాతకు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించాము. ప్రెస్ నోట్‌తో పాటు ఈ కమిట్మెంట్కు సంబంధించిన వివరాలను మే 27నే ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌కు ఈమెయిల్ తో పాటు కొరియర్ ద్వారా డాక్యుమెంట్స్ పంపాము. ఇప్పడు మాకు తెలియదు అంటే కుదరదు’ అని నిర్మాతకు కౌంటర్ గా లెటర్ రిలీజ్ చేసింది ఛాంబర్. అయితే దీనిపై జూన్ 15న నిర్మాత నుండి తిరస్కరణ సమాధానం రావడంపై ఎగ్జిబిటర్ల సబ్-కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పడు ఈ వివాదం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!