Site icon NTV Telugu

Waltair Veerayya: పోస్టర్స్ తోనే హీట్ పెంచుతున్నారు…

Veerayya Title Song

Veerayya Title Song

సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించడానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ క్యామియో రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రెండు అదిరిపోయే పాటలని ఇచ్చాడు. ఇన్స్టాంట్ హిట్స్ గా నిలిచిన రెండు సాంగ్స్ ని మించి మూడో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వీరయ్య టైటిల్ సాంగ్’ అంటూ బయటకి రానున్న ఈ మూడో సాంగ్, ఇప్పటివరకూ జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ కి మరింత కిక్ ఇచ్చే రేంజులో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
Read Also: Maa Bava Manobhavalu: బాలయ్య పాటకి ఇరగదీసే స్టెప్పులు వేసిన చరణ్, బన్నీ

డిసెంబర్ 26న ‘వీరయ్య’ టైటిల్ సాంగ్ బయటకి రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క ట్వీట్ అంత సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి కారణం, అందులో మేకర్స్ వదిలిన పోస్టర్. చిరుని సిల్లౌట్ లో చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ మెగా అభిమానులని ఆకట్టుకునేలా ఉంది. ఇక్కడ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన పోస్టర్ లో చిరు విలేజ్ లుక్ లో కనిపిస్తే… ఈ కొత్త పోస్టర్ లో చిరు ప్యాంట్-షర్ట్ వేసుకోని కనిపించాడు. దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవిని పోలిస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు, క్లైమాక్స్ లో మాత్రమే ఆ పాయింట్ రివీల్ అవుతుంది అనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. మేకర్స్ వదిలిన పోస్టర్స్ చిరంజీవి లుక్ లో వేరియేషన్స్ గమనిస్తే ఈ రూమర్ నిజమనే అనుమానం కలుగుతుంది. మరి డైరెక్టర్ బాబీ ఆ అనుమానాన్ని నిజం చేసి చూపిస్తాడా లేదా అనేది తెలియాలి అంటే జనవరి 13 వరకూ ఆగాల్సిందే.


Read Also: Nagarjuna: సెలబ్రిటీలు చనిపోతే నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు?

Exit mobile version