New Look Of Balayya Leaked From Veera Simha Reddy Sets: నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బీ, సీ సెంటర్స్ విజిల్స్‌తో మోతమోగడం గ్యారెంటీ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, అఖండ సినిమాలే అందుకు ఉదహరణ. బాలయ్య ఫ్యాక్షన్ జానర్‌లో సినిమా చేస్తే సీడెడ్‌లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ మాటని మరోసారి నిరూపించడానికి బాలయ్య సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ జరుపుకుంటోంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ చూస్తే బాలకృష్ణ తనకి టైలర్ మేడ్ లాంటి పాత్రలో మెప్పించబోతున్నాడనే విషయం అర్ధం అవుతోంది. పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో వీరా సింహా రెడ్డి సినిమాని పర్ఫెక్ట్ ప్యాక్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.
ఈ మూవీ నార్త్ అమెరిక రైట్స్‌ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ ఏడాది మహేశ్ ‘సర్కారు వారి పాట’, నాని ‘అంటే సుందరానికి’, కింగ్ నాగ్ నటించిన ‘ది ఘోస్ట్’ సినిమాలు శ్లోక ఎంటర్టైన్మెంట్స్ నుంచే విడుదల అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య లుక్‌కి సంబందించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఒకటి టీజర్‌లో చూపించిన బ్లాక్ షర్ట్ లుక్ కాగా మరొకటి వైట్ అండ్ వైట్ వేసుకోని బాలయ్య చైర్‌లో కూర్చున్న ఫోటో. నందమూరి అభిమానులు #VeeraSimhaReddy అనే హాష్ టాగ్‌ని క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.