Site icon NTV Telugu

Pawan Kalyan: పవర్ స్టార్ కాదు పవర్ హౌజ్‌…

Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్‌ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్‌కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్‌, క్రౌడ్ పుల్లింగ్‌ చూసి.. గూస్ బంప్స్ వచ్చేలా పవర్ ఫుల్ ఇంటర్వెల్ బ్యాంగ్ రాసుకున్నాడు రాజమౌళి. ఇలా ఎంత చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి తక్కువే. సినిమాలే కాదు జనం మెచ్చే… జనంతో నడిచే జనసేనాని పవర్ స్టార్. రాజకీయంగా కూడా పవన్ ఓ ప్రభంజనం. అలాంటి పవర్ స్టార్ బర్త్ డే వస్తే… అభిమానులకు దాన్ని మించిన పెద్ద పండగ లేదు.

సెప్టెంబర్ 2 తమ అభిమాన హీరో జన్మించిన రోజు కావడంతో… హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ బర్త్ డేకి పవన్ నుంచి నాలుగు సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ముందుగా అర్థరాత్రి హరిహర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం పది గంటలకు ఓజి టీజర్ రిలీజ్ చేశారు. సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రానున్నాడు. అలాగే పవన్, సురేందర్ రెడ్డి సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మరోవైపు గుడుంబా శంకర్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఏదేమైనా… మెగా బ్రదర్‌గా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్… తన మ్యానరిజం, ఆటిట్యూడ్, స్టైల్‌ అండ్ స్వాగ్‌తో.. పవర్ స్టార్‌గా ఏ హీరోకి లేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే పవర్ స్టార్ అంటే ఈ జనరేషన్ చూసిన ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు.

Exit mobile version