Syed Sohel: బిగ్ బాస్ హోస్ట్ సినిమాలకే దిక్కు లేదు.. కంటెస్టెంట్ సినిమాలు చూడాలంట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Syed Sohel: ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు.. రియాలిటీ షోకు వెళ్ళినప్పుడు ఆదరించారు.. ఇవన్నీ ఈ కాలం జనరేషన్ లో కుదరడం లేదు. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. కథ బావుంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. బిగ్ బాస్ కు వెళ్లి బిగా పేరు తెచ్చుకోని బయటకు వచ్చిన ఒక నటుడు .. హీరోగా సినిమా చేస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదని ప్రశ్నించాడు. అతడే సోహైల్. అతను నటించిన బూట్ కట్ బాలరాజూ సినిమా నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. దీంతో మొదటి షో అభిమానులతో చూసి బయటకు వచ్చిన సోహైల్ కెమెరా ముందు కంటనీరు పెట్టుకున్నాడు. “అరె.. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇది! క్యూట్ సినిమా తీశావని కొందరు మెచ్చుకుంటున్నారు. నిజంగానే బూట్‌కట్ బాలరాజు బానే ఉంది కదా.. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడూ స్నేహితులతోనే కాదు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడండి. నా సినిమాకు వెళ్లండన్నా.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నాకు మద్దతుగా వేల కామెంట్లు పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నా?” అంటూ ఏడ్చాడు.
ఇక సోహైల్ ప్రవర్తనపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. సానుభూతి కావాలని డ్రామాలు చేయకు.. బిగ్ బాస్ వేరు, సినిమా వేరు.. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ కథ నచ్చితేనే చూస్తారు. నువ్వేమి ఇంత అడగనవసరం లేదు. కథలో దమ్ముంటే ప్రేక్షకులు వాళ్ళే వస్తారు. బిగ్ బాస్ హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున తీసిన సినిమాలే కథ బాగోకపోతే ఎవరు చూడలేదు. ఆఫీసర్, ఘోస్ట్ వంటి సినిమా నాగ్ హోస్ట్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్స్ చూడలేదా.. ? నాని.. బిగ్ బాస్ చేసేటప్పుడు కూడా అతడి సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అది కనిపించలేదా.. ? బిగ్ బాస్ హోస్ట్ సినిమాలకే దిక్కు లేదు.. కంటెస్టెంట్ సినిమాలు చూడాలంట..?అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సక్సెస్ రావడానికి సమయం పడుతుంది.. ఓపిగ్గా చేసుకుంటూ పోవాలి. ఇలా ఎమోషనల్ అయితే ఏం వస్తుంది బ్రో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!