NTV Telugu Site icon

Manchu Lakshmi: ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు దేవతవక్కా..

Manoj Manchu

Manoj Manchu

Manchu Lakshmi: మంచు వారసులు అంటే.. తెలుగు ఇండస్ట్రీలో తెలియనివారు లేరు. మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్.. కుమార్తె మంచు లక్ష్మీ. ఈ కుటుంబం మొత్తాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్న విషయం కూడా తెల్సిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో ఈ వారసులు ఏది చేసినా సంచలనమే. విష్ణు కానీ, లక్ష్మీ కనై ట్వీట్ చేయడం ఆలస్యం విమర్శించడానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ట్రోలర్స్. ఇక ఇలాంటి ట్రోలింగ్ ను పట్టించుకోవడం మంచు కుటుంబం ఎప్పుడో మానేసింది. ఇక మంచు లక్ష్మీ ని తన ఇంగ్లీష్ ను ఎంతమంది ఎన్నిసార్లు ట్రోల్ చేశారో లెక్కే లేదు. అయినా ఆమె అంటే అభిమానులకు ఎప్పుడు ఇష్టమే. ముఖ్యంగా ఒక్క విషయంలో ఆమెను అందరు మెచ్చుకుంటున్నారు. ఆ విషయమే.. తమ్ముడికి దగ్గర ఉండి పెళ్లి చేయడం. మంచు మనోజ్ పెళ్లి మౌనిక రెడ్డితో ఈ రాత్రి జరగనున్న విషయం తెల్సిందే.

RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్

టీడీపీ దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో మనోజ్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్న విషయం విదితమే. ఈ జంట ఎన్నోసార్లు కెమెరా కంటికి కూడా కనిపించారు. అయితే ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ, అందుకు మోహన్ బాబు ఒప్పుకోలేదని టాక్.. ఈ వివాదం వలనే మనోజ్ ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళిపోయాడట. కాగా, తాజాగా తమ్ముడు ప్రేమను అక్క లక్ష్మీ అర్ధం చేసుకుంది. తండ్రి, అన్న దగ్గర లేకపోయినా.. మనోజ్ కు తండ్రి స్థానంలో నిలబడి ఆమె పెళ్లి జరిపిస్తుందని తెలుస్తోంది. తమ్ముడిని పెళ్లి కొడుకును చేసి.. అక్క ఎంతో మురిసిపోయింది. దగ్గర ఉండి తన ఇంట్లోనే తమ్ముడి పెళ్లి చేస్తోంది. మరి కొద్దిసేపట్లో ఈ జంట వివాహం ఘనంగా జరగనుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు మంచు లక్ష్మీ మనసును ఎంతో ప్రశంసిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు దేవతవక్కా.. తమ్ముడు మనసును అర్డం చేసుకున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments