NTV Telugu Site icon

Rashmi Gautam: చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తా.. యాంకర్ రష్మీకి బెదిరింపులు

Rashmi Gautam

Rashmi Gautam

Netigen Threatens Rashmi Gautam: సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు హద్దుమీరుతుంటారు. తారల్ని టార్గెట్ చేసి, వారిపై దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. మంచి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్పందించినా సరే, ‘అవన్నీ నీకెందుకు’ అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలతో ఎగబడుతుంటారు. కొందరైతే బెదిరింపులకు కూడా దిగుతుంటారు. ఇలాంటి అనుభవాల్ని పెద్ద పెద్ద సినీ తారలు సైతం ఎదుర్కున్నారు. ఇప్పుడు రష్మీ గౌతమ్‌కి అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ చేతబడి చేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

David Miller: కోహ్లీ కన్నా బాబర్ బెటర్.. డేవిడ్ షాకింగ్ కామెంట్స్

అసలేం జరిగిందంటే.. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రష్మీ గౌతమ్ తనదైన శైలిలో స్పందించింది. ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్‌ చేసింది. దీనికితోడు.. గోసంరక్షణ మీద కూడా ట్వీట్ చేసింది. ఈ భూమ్మీద కేవలం మనుషులమే బతుకుతున్నామా? జంతువుల పట్ల మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? మన స్వార్థం కోసం వాటిని ఇబ్బందులకు గురి చేస్తున్నామంటూ ట్వీటింది. ఈ ట్వీట్లపై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు మాత్రం నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా? అంటూ ప్రశ్నించారు. అయితే.. ఓ నెటిజన్ మాత్రం హద్దు మీరి ప్రవర్తించాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు.

Pakistan Economic Crisis: ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..

‘‘నీకు ఆల్రెడీ 40 సంవత్సరాలు వచ్చేశాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసుకో’’ అంటూ మొదట్లో ఓ మెసేజ్ పెట్టాడు. అనంతరం.. ‘‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్‌ అవుతాయా? నీ మీద యాసిడ్‌ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ మెసేజ్ పెట్టాడు. అది స్క్రీన్ షాట్ తీసి ట్వీటర్‌లో పోస్ట్ చేసిన రష్మీ.. ‘‘ఈ ఎకౌంట్ ఎవరిదో తెలీదు కానీ, చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరి, ఇన్ని మాటలన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?