Netflix Pandaga: నెట్ ఫ్లిక్స్ పండగో.. సంక్రాంతి రోజు 12 తెలుగు సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netflix Pandaga: ప్రపంచవ్యాప్తంగా టాప్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ సంక్రాంతి నాడు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. మొత్తం 12 సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లుగా ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసింది. ఒక్కొక్క సినిమా గురించి వివరిస్తూ ఒక్కొక్క పోస్ట్ పెడుతూ వెళ్ళింది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్టీమ్ అవబోతుందని ప్రకటించింది. ఇప్పటికే నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోందని దానితో పాటు క్రేజీ ప్రాజెక్టులుగా పేరు తెచ్చుకున్న పుష్ప 2 ది రూల్, ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయని ప్రకటించింది. ఇక వాటితో పాటు నందమూరి బాలకృష్ణ 19వ సినిమా, విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ 37వ సినిమాగా తెరకెక్కుతున్న సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయని ప్రకటించింది.
Akira Nandan: ఎడిట్ చేస్తే చేశారు కానీ.. ఏమన్నా ఉందా మావా పిక్
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
అల్లు శిరీష్ హీరోగా నటించిన బుడ్డి సినిమా అలాగే కార్తికేయ యూవీ క్రియేషన్స్ సినిమాతో పాటు, నార్నె నితిన్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా తమ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ సినిమాలన్నీ థియేటర్లలో సందడి చేసిన తర్వాత తమ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియన్స్ కి అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించినట్లు అయింది. అప్ కమింగ్ లైనప్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా విపి – కంటెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ.. “నెట్‌ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ వ్యూస్ లో 50% YoY గ్రోత్ మా తెలుగు సినిమా స్ట్రాంగ్ అప్పీల్ ప్రతిబింబిస్తుంది. ఈ సంవత్సరం లైనప్, అత్యుత్తమ తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలతో, ఇండస్ట్రీ బిగ్ స్టార్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అత్యుత్తమ తెలుగు చిత్రాలని అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..