Site icon NTV Telugu

Nenevaru: ‘నేనెవరు’ అంటున్న అందాల భామ!

Poonam

Poonam

Kola Balakrishna: సీనియర్ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ సినిమాతో తెరంగేట్రమ్ చేశాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బాలకృష్ణకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కోలా బాలకృష్ణతో నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమనేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు ‘నేనెవరు’ మూవీని నిర్మించారు. దీనికి పూనమ్ చంద్, కుమావత్, కిరణ్‌ కుమార్ మోటూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అందాల భామ సాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ సినిమాలో తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రలు పోషించారు. ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన ప్రతినాయుడిగా నటించాడు. ఈ సినిమాతో ఆర్.జి. సారథి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం ఇదని, బిజినెస్ పరంగానూ చక్కని క్రేజ్ ను ఈ మూవీ క్రియేట్ చేసింద’ని నిర్మాతలు తెలిపారు. రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి. ఎస్. రావు, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Exit mobile version