Site icon NTV Telugu

Neha Shetty : అల్లు అర్జున్ తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ

neha-Shetty

ఇటీవలే “డీజే టిల్లు”తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లే తలుపు తడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మన డీజే టిల్లు లవర్ అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది. ‘పుష్ప’ హిట్టుతో పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ తో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు చాలా త్వరగానే లభించింది అని చెప్పొచ్చు. అయితే ఈ అవకాశం సినిమాలో కాదు ఒక యాడ్ లో.

Read Also : Radhe Shyam : సెన్సార్ పూర్తి… రన్ టైం ఎంతంటే ?

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు అల్లు అర్జున్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన కొత్త యాడ్ కు సంబంధించిన జోమాటో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమో వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Exit mobile version