Neha Sharma: చిరుత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ. చరణ్ మొదటి సినిమాలో అమ్మడు ఆఫర్ అందుకోవడమే ఆలస్యం.. నేహాపై టాలీవుడ్ ఫోకస్ పడింది. మొదటి సినిమాతోనే ముద్దుగుమ్మ అందంతో పాటు.. ఓ రేంజ్ యారొగెంట్ గా కనిపించినా కూడా అభిమానులు తమ మనస్సులోకి ఆహ్వానించారు. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా ఎందుకో తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మరోసారి టాలీవుడ్ వైపు చూడలేదు. ఇక బాలీవుడ్ లో ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ కనిపిస్తుంది.
Thalapathy Vijay: షాకింగ్.. హాస్పిటల్లో విజయ్.. అసలేమైంది.. ?
ఇక అమ్మడు సినిమాలు మొత్తం ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో నేహా చేసే రచ్చ మరో ఎత్తు. అసలు అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ భామ ఎక్కడకు వెళ్లినా.. ఏ డ్రెస్ లో అయినా కూడా ఎద అందాలను.. లేదా థైస్ ఎలివేషన్ చేయకుండా ఉండదు. కానీ, ఈసారి మాత్రం ముద్దుగుమ్మ ఫుల్ డ్రెస్ తో దేహాన్ని కప్పేసింది. అమ్మడితో పాటు ఆమె చెల్లి కూడా ఎంతో పద్దతిగా రెడీ అయ్యి కనిపించింది. ఇద్దరు బ్లాక్ కలర్ కుర్తాలు వేసుకొని.. చక్కగా బొట్టు పెట్టుకొని కనిపించారు. సడెన్ గా వీరిని ఇలా చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. అందాల ఆరబోత కాకుండా పద్దతిగా వీరు కనిపించడంతో.. అమ్మ బాబోయ్.. శర్మ సిస్టర్స్.. ఈ బట్టల్లోనా.. అస్సలు నమ్మలేకపోతున్నామే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
— Neha Sharma (@Officialneha) November 3, 2023