NBK108: నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నచిత్రం NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. వారి కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య పోస్టర్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. భగవత్ కేసరి అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ లాంచ్ ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 8 న పవర్ ఫుల్ టైటిల్ లాంచ్ అంటూ అధికారికంగా ప్రకటించారు.
Samantha: టర్కీలో సామ్ వేషాలు.. బాత్రూమ్ ఫోటో హైలైట్
ఇక ఇప్పటివరకు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉన్న అనిల్.. మొట్టమొదటిసారి బాలయ్యతో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు చూడని బాలయ్య లుక్ ను అనిల్ ఇందులో చూపించబోతున్నాడట. ఫ్యాన్ మేడ్ పోస్టర్లకే నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక అంత పవర్ ఫుల్ టైటిల్ రోజున యుద్ధం చేయకుండా ఉంటారా.. సోషల్ మీడియా మొత్తం బాలయ్య స్లొగన్స్ తో.. టైటిల్ పోస్టర్స్ తో, ఎడిట్స్ తో రచ్చ లేచిపోవాలి. మరి బాలయ్య ఫ్యాన్స్ ఈ యుద్దానికి సిద్ధమా అన అభిమానులు జూన్ 8 కు సిద్ధమైపోయారు. మరి అందరు అనుకున్నట్లు భగవత్ కేసరినే ఫిక్స్ చేశారా..? లేక మరో కొత్త టైటిల్ అనుకుంటున్నారా..? అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాల్సిందే.
