NBK107 మేకర్స్ శరవేగంగా కానిస్తున్న పనులు చూసి.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని జూన్ 10వ తేదీన ఏదైనా క్రేజీ అప్డేట్ రావొచ్చని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. లేటెస్ట్‌గా యూనిట్ సభ్యులు ఇచ్చిన అప్డేట్‌ని బట్టి చూస్తే.. జూన్ 10న లేదా అంతకుముందు రోజే NBK107 టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ‘సింహం వేటకు సిద్ధం.. #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్’ అనే క్యాప్షన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో.. టీజర్ రాబోతోందంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
ఇదే సమయంలో టైటిల్‌ని అనౌన్స్ చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే ‘అన్నగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. చూస్తుంటే.. దాదాపు ‘అన్నగారు’ టైటిల్‌నే ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. మరి, ఏ టైటిల్‌ని అనౌన్స్ చేస్తారో చూడాలి. కాగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో.. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలావుండగా.. ఈ సినిమా పనుల్ని పూర్తి చేసుకున్న వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇందులో ఈయన క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉండనుంది. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఆయన కూతురిగా నటించనుంది.
Simham veta ki sidham 🔥#NBK107 First Hunt Loading 💥💥
NATASIMHAM #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @OfficialViji @varusarath5 @MusicThaman pic.twitter.com/RFB8KgtMAr
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022
