Prabhas: ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఎన్‌బీకే విత్ అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. తాజాగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను బాలయ్య ఇంటర్వ్యూ చేశారన్న వార్త ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తొలిసారి బాలయ్య-ప్రభాస్ కలిసి ఒక షోలో పాల్గొనడంతో ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్‌తో కలిసి హాజరుకావడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఈ షోలో హీరో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలర్‌ఫుల్ షర్టులో ప్రభాస్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రభాస్ ధరించిన షర్ట్ ఏ బ్రాండ్, దాని ధర ఎంత అనే అంశాలపై అభిమానులు వివరాలు రాబడుతున్నారు. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్`. దీని ధర 115 పౌండ్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,618 అన్న మాట. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత సింపుల్‌గా కనిపిస్తున్న ఈ షర్ట్ ఇంత ఖరీదా అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: Sankranthi Rush: సంక్రాంతికి రైళ్ళు, బస్సులు ఫుల్.. పండుగకు బాదుడేనా?
కాగా హీరో ప్రభాస్ సాధారణంగా పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు. ఇటువంటి టాక్ షోలు, టీవీ షోలకు తక్కువగా హాజరవుతూ ఉంటాడు. కానీ తాజాగా బాలయ్య టాక్ షోలో పాల్గొన్నాడు. దీంతో అతడి అభిమానులంతా ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా వారు వీడియో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.