Site icon NTV Telugu

‘జై బాలయ్య’ అంటున్న గోపీచంద్ మలినేని

NBK 107 is ‘Jai Balayya’!

త్వరలో ‘అఖండ’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఎన్.బి.కె 107గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ‘క్రాక్’ విజయంతో గోపీచంద్ మలినేని ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ సినిమాకి రీచర్చ్ చేసి మరీ కథను రెడీ చేశాడు. హై యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నాడు.

Read Also : బాలయ్య టాక్ షోలో చిరంజీవి

నిర్మాతలు టైటిల్ ని రిజిస్టర్ చేసినా అధికారికంగా ప్రకటించలేదు. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ టైమ్ లో సినిమా టైటిల్‌ని ప్రకటిస్తారట. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇందులో ముఖ్యమైన పాత్రలో నటించనుంది. తమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గతంలో చిరంజీవి హీరోగా ‘జై చిరంజీవ’ అనే సినిమా తెరకెక్కింది. అయితే అది పరాజయం పొందిన నేపథ్యంలో బాలకృష్ణ సినిమాకు ‘జై బాలయ్య’ అని పెట్టే సాహసం చేస్తారా? అన్నది సందేహమే. చూడాలి మరి ఏ టైటిల్ నిర్ణయిస్తారో!?

Exit mobile version