బాలయ్య టాక్ షోలో చిరంజీవి

నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్‌ ద టాలీవుడ్ గా మారింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తున్నాడు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ వర్నింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి అతిథులుగా కనిపిస్తారట. తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. అలాగే అక్కినేని నాగార్జున, అతని కుమారులతో బాలకృష్ణ ఇంటర్వ్యూ కు సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. ఇక పూరీ జగన్, క్రిస్ వంటి దర్శకుల సంగతి సరేసరి. బాలయ్యతో పనిచేసిన దర్శకులు, తారలు కూడా ఈ టాక్ షోలో మెరవనున్నారు. నవంబర్ లో ఈ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ ఉంటుందని టాక్.

Read Also : నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం

-Advertisement-బాలయ్య టాక్ షోలో చిరంజీవి

Related Articles

Latest Articles