NTV Telugu Site icon

Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !

February 7 (11)

February 7 (11)

సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రజంట్ బాషా తో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రల్లో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా ప్రజంట్ ఇద్దరు పిల్లలతో తల్లి ప్రేమను ఆస్వాదిస్తోంది కానీ.. ఒకప్పుడు మాత్రం నయన ఎఫైర్స్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉండేది..

Also Read:Shilpa: మహేష్ బాబు ఫ్యామిలీ గురించి.. నమ్రత సిస్టర్ వైరల్ కామెంట్స్

కెరీర్ స్టార్టింగ్ లోనే నటుడు ప్రభుదేవా తో పరిచయం ఏర్పడి అతనితో ప్రేమలో పడింది నయన. చివరికి ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతారని వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి కానీ ప్రభు టార్చర్ భరించలేక నయన బ్రెక్ అప్ చెప్పింది. తర్వాత కోలీవుడ్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ కూడా విడిపోవడం జరిగింది.

అయితే ఇటివల ఓ ఇంటర్వ్యూలో నయన రిలేషన్‌షిప్ గురించి నాగర్జున కామెంట్స్ చేశాడు. నయనతార తన లవర్ నుంచి చాలా ఇబ్బందులను, వేధింపులు ఎదుర్కొన్నదట. నయనతార ఏడ్వడం కూడా నాగార్జున చాలా సార్లు చూశారట. అంతటి బాధను దిగమింగుకొని మరీ సినిమా షూటింగ్ లో ఆ బాధను కనిపించకుండా యాక్టింగ్ చేసింది అని నాగార్జున తెలియజేశారు. ఏదేమైనా ప్రతి విషయానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. ప్రజంట్ నయనతార జీవితంలో అదే జరిగింది. ఎవ్వరి వల్ల తాను ఇబ్బందులు పడిందో వారి ముందు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ హోదాలో.. హీరోలతో సమానంగా రెమ్యూనరెషన్ డిమాండ్ చేసే రేంజ్ కి వచ్చేసింది. ఇది కధా సక్సెస్ అంటే.