Site icon NTV Telugu

Nayanatra : లక్షల్లో పెళ్లి చీర.. కోట్లలో నగలు..!

New Project (8)

New Project (8)

 

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌.. చాలా గ్రాండ్‌గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి చీర ధర ఎంత.. ఆమె ధరించిన నగలు ఎన్ని కోట్ల విలువ చేస్తుంది.. అనే చర్చ జరుగుతోంది. అందులోభాగంగా.. పెళ్లిలో నయనతార ధరించిన నగలను.. విగ్నేష్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అవి దాదాపు 5 కోట్ల రూపాయల విలువ చేస్తాయని టాక్.

ఇక నయనతార పెళ్లి కోసం ప్రత్యేకంగా గద్వాల్ పట్టు చీరను.. బంగారు తీగలతో డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. ఈ చీర కోసం దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసిందట. దాంతో ఈ చీరలో నయనతార నిజంగానే పసిడి కాంతుల్లో మెరిసిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా నయనతార లక్షలతో చీర.. కోట్లతో నగలు డిజైన్ చేయించుకోవడంతో.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక.. ఈ పెళ్లి జరిగిన రిసార్ట్‌లోకి బయట వారు రాకుండా.. క్యూఆర్ కోడ్ సిస్టం పెట్టి అతిథులను ఆహ్యానించారు. అందుకే పెళ్లి తర్వాత నయన్-విక్కీ కలిసి.. తమిళనాడులో 18,000 మంది పిల్లలకు, లక్ష మంది జనాలకు భోజనం అందించినట్టు తెలుస్తోంది. దాంతో ఈ జంటని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక.. గతంలో ఈ అమ్మడు శింబు, ప్రభుదేవాతో లవ్‌లో పడి.. బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘నాను రౌడీదాన్‌’ షూటింగ్‌ సమయంలో విఘ్నేష్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ లవ్‌ బర్డ్స్‌.. గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొని.. ఇప్పుడు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

Exit mobile version