Nayanatra : లక్షల్లో పెళ్లి చీర.. కోట్లలో నగలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. చాలా గ్రాండ్‌గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి చీర ధర ఎంత.. ఆమె ధరించిన నగలు ఎన్ని కోట్ల విలువ చేస్తుంది.. అనే చర్చ జరుగుతోంది. అందులోభాగంగా.. పెళ్లిలో నయనతార ధరించిన నగలను.. విగ్నేష్ కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. అవి దాదాపు 5 కోట్ల రూపాయల విలువ చేస్తాయని టాక్.
Also Read
ఇక నయనతార పెళ్లి కోసం ప్రత్యేకంగా గద్వాల్ పట్టు చీరను.. బంగారు తీగలతో డిజైన్ చేయించుకున్నట్లు సమాచారం. ఈ చీర కోసం దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసిందట. దాంతో ఈ చీరలో నయనతార నిజంగానే పసిడి కాంతుల్లో మెరిసిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా నయనతార లక్షలతో చీర.. కోట్లతో నగలు డిజైన్ చేయించుకోవడంతో.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక.. ఈ పెళ్లి జరిగిన రిసార్ట్‌లోకి బయట వారు రాకుండా.. క్యూఆర్ కోడ్ సిస్టం పెట్టి అతిథులను ఆహ్యానించారు. అందుకే పెళ్లి తర్వాత నయన్-విక్కీ కలిసి.. తమిళనాడులో 18,000 మంది పిల్లలకు, లక్ష మంది జనాలకు భోజనం అందించినట్టు తెలుస్తోంది. దాంతో ఈ జంటని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక.. గతంలో ఈ అమ్మడు శింబు, ప్రభుదేవాతో లవ్‌లో పడి.. బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘నాను రౌడీదాన్’ షూటింగ్ సమయంలో విఘ్నేష్‌తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్.. గత లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకొని.. ఇప్పుడు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!