Site icon NTV Telugu

Nayan-Vignesh Wedding Video : నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ వీడియో ఆన్ ద వే!

Nayan Vignes

Nayan Vignes

Nayan-Vignesh Wedding Video On The Way!

 

నయనతార, విఘ్నేష్ శివన్, నెట్ ఫ్లిక్స్ మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. వివాహ ప్రసార హక్కుల కోసం 25 కోట్లకు ఒప్పందం చేసుకున్న నెట్ ప్లిక్స్ విఘ్నేష్ శివన్ కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయటంతో మొదలైన వివాదం డీల్ కాన్సిల్ చేసుకునే వరకూ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ నెట్ ఫ్లిక్స్ ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను షేర్ చేస్తూ ‘వారు నెట్ ప్లిక్స్ కి వస్తున్నారు’ అంటూ ప్రకటించింది.
అయితే ముందు అనుకున్న మొత్తం 25 కోట్లలో కొంత మొత్తాన్ని వివాహ ఖర్చులకు ఉపయోగించిన నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ఉల్లంఘన కింద మిగతా మొత్తాన్ని ఇవ్వటానికి నిరాకరించినట్లు దానికి నయన్, విఘ్నేష్ కూడా అంగీకరించినట్లు అనధికారికంగా తెలియవస్తోంది.
ఇక ఈ వెడ్డింగ్స్ డీల్ లో భాగం తమ లవ్ స్టోరీని నయనతార, విఘ్నేష్ శివన్ ప్రత్యేకంగా వివరిస్తారట. అంతే కాదు వారి వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత స్నేహితుల ఇంటర్వ్యూలు, పెళ్లికి సంబంధించిన అన్ని రకాల విజువల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తాయట. ఎంతో కాలాంగా ఈ జంట పక్షుల ప్రేమ గురించి అలాగే పెళ్ళి వేడుకకు సంబంధించిన వీడియోను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్న వారి కోసం నెట్‌ఫ్లిక్స్ త్వరలో వీటిని విడుదల చేయబోతోంది. మరి సుధీర్ఘంగా సాగిన ఈ నయన్, విఘ్నేష్ పెళ్ళి వేడుకల వీడియోకు 25 కోట్లు పలికితే ఫామ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోలు, హీరోయిన్ల వేడుకలు ఇంకెంత ధర పలుకుతాయో చూడాలి.

Exit mobile version