నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ మహమ్మారి కాస్త తెరిపినిస్తే సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉంది. ఈ సారి జరిగే చిత్రీకరణలో నవాజుద్దీన్ కూడా పాల్గొంటాడు. ఆయన విలన్ గా నటించబోతన్న ‘హీరోపంతి 2’లో తారా సుతారియా హీరోయిన్. ఇంతకు ముందు విడుదలైన ‘హీరోపంతి’లో కృతీ సనన్ కథానాయిక. కాగా దానికి సీక్వెల్ తో జనం ముందుకు వస్తోన్న ‘హీరోపంతి 2’ దర్శకుడు బాణీల బాధ్యత ఏఆర్ రెహ్మాన్ పై పెట్టాడు. ఆస్కార్ విన్నర్ అందిస్తోన్న ట్యూన్స్, టైగర్ ష్రాఫ్ డ్యాన్సులు, తారా సుతారియా గ్లామర్… ‘హీరోపంతి 2’ని మ్యూజికల్ హిట్ గా నిలుపుతాయని మూవీ లవ్వర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి, తెరపై నవాజుద్దీన్ సిద్ధీఖీ, టైగర్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందో!