NTV Telugu Site icon

Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?

Naveen

Naveen

Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నవీన్.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకున్నాడు. ఇక జాతిరత్నాలు సమయంలో ఈ జాతిరత్నం చేసిన హంగామా అంతా ఇంత కాదు. సంగారెడ్డి కుర్రాడు అంటూ ప్రభాస్ తో చేసిన రచ్చ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక జాతిరత్నాలు తరువాత నవీన్ ‘అనగనగ ఒక రాజు’అనే సినిమాను ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు

ఇక ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు నవీన్ పుట్టినరోజుకు స్పెషల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ సరసన శ్రీలీల నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఈ టీజర్ రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తోంది. ఇప్పటివరకు ఈ సీనియాకు సంబంధించిన ఒక్క అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఉందా..? లేదా..? అనే కన్ఫర్మేషన్ కుడా లేదు. ప్రస్తుతం నవీన్.. యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్నాడు. అనుష్క- నవీన్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. మరి ఆ రాజు పరిస్థితి ఏంటి.. నవీన్ బ్రో .. కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఈ విషయం క్లారిటీ ఇస్తావా..? అంటూ అభిమానులు అడుగుతున్నారు. మరి ఈ జాతి రత్నం ఏమైనా రిప్లై ఇస్తాడేమో చూడాలి.

Show comments