అమెజాన్ ప్రైమ్‌ లో ”టక్ జగదీష్”

Nani not interested to OTT Release of Tuck Jagadish

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ పై అఫీషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చేసింది. ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు… ఈ సినిమా బృందం ప్రకటించింది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందని పేర్కొన్న చిత్ర బృందం… త్వరలోనే రిలీజ్‌ డేట్‌ ను కూడా ప్రకటిస్తామని తెలిపింది.