NTV Telugu Site icon

Nani: సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా..

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని నాని కాస్తా.. న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇక నాని స్టార్ హీరోగా మారాక.. 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్త ని వివాహమాడాడు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. అంజనా, నాని పరిచయం ఫేస్ బుక్ లో జరిగింది. అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అంజనా కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఇక వీరికి జున్ను అనే కుమారుడు ఉన్నాడు. నేడు నాని, అంజనా 11 వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.

Guntur Kaaram: డీఓపీ తొలగింపు.. అసలు నిజం చెప్పిన కొత్త డీఓపీ

ఇక నాని.. తన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ.. భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఆ ఫోటోలో ఏదో పూజలో కూర్చున్న అంజన నుదుటిన కుంకుమ పెడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోపై నాని అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. సీతమ్మకు బొట్టు పెడుతున్న రామయ్యలా ఉన్నావయ్యా.. అని కొందరు.. సూపర్ పిక్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాని.. హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇది కాకుండా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో నాని ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.