ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం తమ హీరోను తక్కువగా చూపించి, మరో హీరోను ఎక్కువగా చూపించారని వార్స్ స్టార్ట్ చేశారు. ఇక మరో హీరో ఫ్యాన్స్ మేమేమైనా తక్కువా అంటూ మీ హీరో కు నటన రాదు అందుకే మా హీరోను ఎక్కువ చూపించారు అని యుద్ధం మొదలుపెట్టారు. ఇక ఈ వార్ నడుస్తున్న క్రమంలోనే ఈ సినిమాలోని మాస్ సాంగ్ నాటు నాటు సాంగ్ వీడియో ను వదిలారు మేకర్స్. ఇక దీంతో ఈ వార్ కాస్తా ముదిరిపోయింది.
ఇద్దరు స్టార్ హీరోల డాన్స్ అదరగొట్టేశారు. టాలీవుడ్ లో తారక్, చరణ్ ఇద్దరు బెస్ట్ డాన్సర్లు. వారి డాన్స్ కు, గ్రేస్ కు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్క ఫ్యాన్స్ మాత్రం ఇద్దరినీ వేరువేరుగా చూస్తూ.. తమ హీరో డాన్స్ ఇరగదీసాడంటే.. తమ హీరో తోపుగా చేశాడంటూ ట్విట్టర్ లో వార్ స్టార్ట్ చేశారు. స్లో మోషన్ లో వీడియోను జూమ్ చేసి చూస్తూ తమ హీరో కాలు అలా కదిపితే.. మరో హీరో ఇలా కదిపాడు.. పర్ఫెక్ట్ మూమెంట్ రాలేదని.. తప్పులు ఎంచుతూ వాటి స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసి మరి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్విట్టర్ వార్ నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే.. జక్కన ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేసిన విధానం అద్భుతమని చెప్పాలి.. ఇద్దరు హీరోలు కూడా ఒక్కటిగా కలిసి కష్టపడితే ఈ అద్భుతం బయటికి వచ్చింది. అయినా వారి కష్టాన్ని ఫ్యాన్స్ అర్ధం చేసుకోకుండా ఇలా చేయడం పద్దతి కాదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
