Natu Natu Song: మన “నాటు నాటు…” పాటకు ఆస్కార్ వచ్చేసినట్టే!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది. మన భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13న) ఉదయం 5 గంటలకు ఉత్సవం ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు సంస్థలు ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్’ విడుదల చేశాయి. నాలుగు జాబితాల్లోనూ ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకే ఆస్కార్ ఖాయమని పేర్కొనడం విశేషం! మరి ఈ ప్రిడిక్షన్స్ జాబితాలకు విలువ ఉంటుందా? ఆస్కార్ ఓటింగ్ సరళిని గమనిస్తూనే, ఈ ప్రిడిక్షన్స్ సాగుతూ ఉంటాయి. అందువల్ల వీటిని కొట్టిపారేయవలసిన పనిలేదు. ఎటు చూసినా, ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటకు ఆస్కార్ తప్పకుండా వస్తుందనే వినిపిస్తోంది. మన తెలుగునాట కొందరు ఈ అవార్డుల కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న అంశాన్ని లేవనెత్తి మళ్ళీ ఈ పాటపై చర్చకు తెరతీశారు. ఈ నేపథ్యంలోనే ‘ఆస్కార్ ప్రిడిక్షన్స్’ జాబితాలో మన ‘నాటు నాటు…’ సాంగ్ కు అందరూ పెద్ద పీట వేయడం గమనార్హం!
Read Also: Rana Naidu: ఈ బూతుల గోలేంట్రా బాబు… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
‘లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్” వంటి మీడియా హౌస్ ల సర్వేలో “నాటు నాటు…” పాటకే అగ్రతాంబూలం లభించింది. కాబట్టి, ఆస్కార్ అవార్డు ఈ పాటకే దక్కుతుందని అత్యధికులు భావిస్తున్నారు. అలాగే మన దేశం నుండి ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకూ ప్రిడిక్షన్స్ లో మంచి చోటే లభించింది. దర్శకుడు శౌనక్ సేన్ రూపొందించిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ చిత్రం ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్’ విభాగంలో నామినేషన్ సంపాదించగా, కార్తికి గాన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్’ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాలకూ ఆస్కార్ దక్కే అవకాశం ఉన్నట్టు ఈ ప్రిడిక్షన్స్ జాబితాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఓ తెలుగు సినిమా నుండి ‘ఒరిజినల్ సాంగ్’కు తొలిసారి నామినేషన్ దక్కించుకున్న ‘నాటు నాటు…’ పాటలో ఫోక్ రిథమ్, పీరియడ్ నేచర్, డాన్స్ వంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకున్నారని, అందువల్ల తప్పకుండా ఈ పాటకే ఆస్కార్ అవార్డు దక్కుతుందని అమెరికాలోని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. సో… సోమవారం ఉదయం ఐదు గంటలకు ఇండియన్ మూవీ లవర్స్ టీవీలకు అతుక్కు పోవలసిందే!
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!