Rana Naidu: ఈ బూతుల గోలేంట్రా బాబు… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వెబ్ సీరీస్ కంటెంట్ ఏంటి? ఎవరు ఎలా నటించారు అనే విషయాలని కాసేపు పక్కన పెడితే అసలు రానా నాయుడు ట్రెండ్ అవ్వడానికి ఏకైక కారణం ఈ సీరీస్ లోని బూతులు. మొదటి ఎపిసోడ్ నుంచి మొదలైన బూతుల పరంపర, అడల్ట్ కంటెంట్ ఇది నిజంగానే ‘అడల్ట్ సీరీస్’ ఏమో అనిపించే రేంజులో సాగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ క్రిటిక్స్ సైతం ‘రానా నాయుడు వెబ్ సీరీస్’ చూసి ఇంత బూతు ఉంది ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు. డిజిటల్ కంటెంట్ కి కూడా సెన్సార్షిప్ ఉండాల్సిందే అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న కామెంట్స్ ఇప్పుడు రానా నాయుడు పుణ్యమని మరింత ఎక్కువ అయ్యాయి. అయితే కొంతమంది మాత్రం ఇది ‘వెబ్ సీరీస్’ డిజిటల్ స్పేస్ లో రిలీజ్ అయ్యింది, దీన్ని ఇలానే చూడండి. మిర్జాపూర్ లాంటి సీరీస్ ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు, ఇప్పుడు ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ లాంటి హీరో ఆ బూతులని మాట్లాడడమే తెలుగు ఆడియన్స్ తీసుకోలేక పోతున్నారు.
వెంకటేష్ తన ఇమేజ్ ని దాటొచ్చి రానా నాయుడు వెబ్ సీరీస్ చేశాడు కానీ ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేక పోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో రానా నాయుడు పై విమర్శలు వస్తున్నాయి. రిలీజ్ కన్నా ముందు నుంచే రానా నాయుడు వెబ్ సీరీస్ ని వెంకటేష్ ఉన్నాడు కదా అని ఫ్యామిలీతో కలిసి చూడకండి, ఇది సోలోగా చూసే సీరీస్ అని మేకర్స్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట ట్విట్టర్ లో కూడా వినిపిస్తోంది. ఇకపై రానా నాయుడు వెబ్ సీరీస్ చూసే వాళ్లు సోలోగానే చూడండి, ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడండి అంటూ ప్రతి ఒక్కరూ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై రానా, వెంకటేష్ లు స్పందిస్తారో లేదో చూడాలి. అయితే మంచో చెడో ఒక సాలిడ్ బజ్ జనరేట్ చెయ్యడంలో మాత్రం రానా, వెంకటేష్ లు కంప్లీట్ గా సక్సస్ అయ్యారు.
Also Read
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!