RT4GM: రవితేజ-రష్మిక… సూపర్బ్ కాంబినేషన్ సెట్ చేసిన గోపీచంద్ మలినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఒకసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే రెండో సినిమాకి అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చిన రవితేజ, గోపీచంద్ మలినేనిలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఒక్క రోజు జరిగే కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చుండూరు నేపథ్యంలో #RT4GM సినిమా కథ తిరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోపీచంద్ మలినేని-రవితేజల క్రేజీ కాంబినేషన్ కి మరింత క్రేజ్ ని పెంచుతూ నేషనల్ క్రష్ రష్మికని హీరోయిన్ గా ఫైనల్ చేశారని టాక్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక, రవితేజ పక్కన నటించడం #RT4GM ప్రాజెక్ట్ కి కలిసొచ్చే విషయమే. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని మేకర్స్ త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు, ఇదే సమయంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సినిమాని కూడా చేస్తున్నాడు. అక్టోబర్ 19న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయిన తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!