Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News National Crush Rashmika Mandanna Birthday Special

Rashmika: రంజింపచేస్తోన్న రష్మిక…

Published Date :April 5, 2023 , 6:00 am
By Prasanna Pradeep
Rashmika: రంజింపచేస్తోన్న రష్మిక…
  • Follow Us :
  • google news
  • dailyhunt

చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు అచ్చివస్తుందని సినిమా రంగంలో ఓ సెంటిమెంట్ మొదలయింది.

రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. రామయ్య ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో సైకాలజీ, జర్నలిజమ్, ఇంగ్లిష్ లిటిరేచర్ లో డిగ్రీ చేసింది రశ్మిక. చదువు కొనే రోజుల్లోనే రశ్మిక చలాకీ తనం ఎందరినో ఆకర్షించసాగింది. రశ్మిక సైతం తన దరికి చేరిన కొత్తదనాన్ని ఆస్వాదించే ప్రయత్నంలో పరుగులు తీసేది. అలా చదువు పూర్తి కాగానే ఇలా సినిమాల్లో నటించే అవకాశం రశ్మిక తలుపు తట్టింది. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది రశ్మిక. ఈ సినిమాలో రశ్మిక నటన జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రశ్మిక డేటింగ్ మొదలెట్టింది. ఇరువైపుల వారు వారి వివాహానికి అంగీకరించారు. దాంతో రక్షిత్, రశ్మిక నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే రశ్మికకు అదే సమయంలో నటిగా మంచి అవకాశాలు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.

తెలుగునాట నాగశౌర్య ‘ఛలో’ సినిమాతో అడుగు పెట్టింది రశ్మిక. తరువాత ఆమె, విజయ్ దేవరకొండతో కలసి ‘గీత గోవిందం’లో నటించింది. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ పై ‘దేవ్ దాస్’లో నాని సరసన, ‘డియర్ కామ్రేడ్’లో మరోమారు విజయ్ తోనూ, ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబుకు జోడీగా, ‘భీష్మ’లో నితిన్ కు నాయికగా నటించిన రశ్మిక ‘పుష్ప’లో అల్లు అర్జున్ జంటగా భలే కనువిందు చేసింది. శర్వానంద్ తో రశ్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన నటించిన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో కలసి ‘గుడ్ బై’లోనూ రశ్మిక కీలక పాత్రలు పోషించింది. హిందీలోనూ ఈ బుల్లెమ్మ ఫ్యాన్స్ ను పోగేసుకుంది. రశ్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. ఇది కాకుండా రెండు తెలుగు సినిమాల్లోనూ, ‘యానిమల్’ అనే హిందీ చిత్రంలోనూ రశ్మిక నటించనుంది. అనేక సార్లు సైమా అవార్డుల్లో రశ్మిక ఉత్తమ నటిగా సందడి చేయడం విశేషం! అనతి కాలంలోనే అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్న రశ్మిక మునుముందు ఏ తీరున రంజింప చేస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Happy Birthday Rashmika Mandanna
  • HBD Rashmika
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna Birthday Special
  • Rashmika Pushpa 2

తాజావార్తలు

  • LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

  • Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

  • Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

  • Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

  • BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions