చూడగానే బాగా తెలిసిన పిల్లలా కనిపిస్తుంది నటి రశ్మికా మందన్న. ఆమె లేలేత అందం రువ్వే నవ్వులు కుర్రకారును కిర్రెక్కిస్తున్నాయి. తెలుగునాట అడుగు పెట్టిన దగ్గర నుంచీ అలరిస్తూనే ఉంది రశ్మిక. ఇక ఆమె ఆట, మాట సైతం రంజింపచేస్తూనే ఉన్నాయి. దాంతో తెలుగు చిత్రసీమలో రశ్మిక కాల్ షీట్స్ కు ఎంతో డిమాండ్ పెరిగింది. మాతృభాష కన్నడసీమలోనూ, తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తనదైన జిలుగు ప్రదర్శిస్తోంది. అమ్మడి అడుగు…
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అందాల భామ రశ్మికా మందన్న చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. కానీ, ఆమె కూత, రాత, చేత అన్నీ మోత మోగిస్తున్నాయి. కన్నడనాట విరిసిన రశ్మిక తెలుగు చిత్రసీమలో భలేగా సందడి చేస్తోంది. తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తన జిలుగు ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది. రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్.…