యంగ్ హీరో నాగ శౌర్య నటించిన హిట్ సినిమా ‘ఛలో’తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చింది రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ అతితక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. తన గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మిక, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగు, కన్నడ, తమిళ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక. మలయాళ ఫిలిం ఇండస్ట్రీలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వని రష్మిక, హిందీలోకి డెబ్యూ ఇచ్చి ఇప్పటికే రెండు సినిమాలని కూడా చేసేసింది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసినా హిట్ కొట్టిన రష్మిక, హిందీలో మాత్రం అంతగా రాణించలేకపోతోంది. 2022లో అమితాబ్ బచ్చన్ తో ‘గుడ్ బాయ్’, 2023లో సిద్దార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ సినిమాల్లో రష్మిక నటించింది కానీ ఈ రెండు సినిమాలు రష్మిక హిందీ కెరీర్ కి అవసరమైన సాలిడ్ స్టార్ట్ ని ఇవ్వలేకపోయాయి.
ముఖ్యంగా చాలా హోప్స్ పెట్టుకున్న మిషన్ మజ్ను సినిమా రష్మికని బాగా డిజప్పాయింట్ చేసింది. ఇక రష్మిక హిందీలో నిలబడడానికి, తన చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘అనిమల్’. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణభీర్ కపూర్ ముందెన్నడూ చూడనంత వైల్డ్ క్యారెక్టర్ ని ‘అనిమల్’ సినిమాలో ప్లే చేస్తున్నాడు. ఇటీవలే అనిమల్ గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలని ఇంకా పెంచింది. వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి సందీప్ రెడ్డి వంగ రెడీగా ఉన్నాడు. ఈ మూవీ హిట్ అయితే రష్మిక నార్త్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ. అనిమల్ కూడా పోతే పుష్ప 2 వచ్చే వరకూ రష్మిక వెయిట్ చెయ్యాల్సిందే. దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం రష్మిక ఆశలన్నీ అనిమల్ సినిమాపైనే ఉన్నాయి.
#Animal .. pieces of my heart. ❤️ pic.twitter.com/CRsvMqYHjT
— Rashmika Mandanna (@iamRashmika) June 20, 2023
