Site icon NTV Telugu

Rashmika: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా నేషనల్ క్రష్…

Rashmika

Rashmika

ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత స్టార్ హీరోయిన్ అయినా నెగటివ్ కామెంట్స్ ని రష్మిక తీసుకున్నంత ఈజీగా, స్పోర్టివ్ గా ఇంకొకరు తీసుకోరు. చాలా లైవ్లీ ఉండే రష్మిక, కెరీర్ లో మొదటిసారి ఇండియన్ పాపులర్ సెలబ్రిటీ కేటగిరిలో చోటు సంపాదించుకుంది. IMDB ప్రతివారం రిలీజ్ చేసే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ ఫీచర్ లో రష్మిక మూడో స్థానంలో నిలిచింది. రష్మిక IMDB పాపులర్ సెలబ్రిటీ లిస్టులోకి ఎంటర్ అవ్వడం ఇదే మొదటిసారి.

ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కావడంతో సోషల్ మీడియా అంతా రష్మిక ఫాన్స్ హల్చల్ చేశారు. ఇదే సమయంలో పుష్ప ది రూల్ సినిమా నుంచి అల్లు అర్జున్ బర్త్ డే రోజున స్పెషల్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు కారణాలు ఒకే వారంలో జరగడంతో రష్మిక పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. IMDB పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులోకి కొత్తగా డెబ్యు ఇచ్చిన వాళ్లలో వెట్రిమారన్, అల్లు అర్జున్, నాని, కీర్తి సురేష్, తమన్నా, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ లు కూడా ఉన్నారు. నాని, కీర్తి సురేష్ లు దసరా సినిమా హిట్ అయిన కారణంగా పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా మారారు.

Exit mobile version