Natasha : నటాషా.. ఈ పేరు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడమే. ఆమె చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. సెర్బియాకు చెందిన ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేసి బాగా ఫేమస్ అయింది. ఆ క్రమంలోనే హార్ధిక్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకుంది. అయితే విడాకులు తర్వా తన కొడుకును తీసుకుని కొన్నాళ్ల పాటు సెర్బియాకు వెళ్లిపోయింది. అక్కడే చాలా ఏళ్లు ఉన్న తర్వాత రీసెంట్ గా ఇక్కడకు వచ్చింది. అయితే తాజాగా ముంబైలో బాంబేటైమ్స్ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోకు ఆమె కొడుకును తీసుకుని వచ్చింది.
Read Also : Alluri Sitharamaraju District: అరకులోయలో మరో చేతబడి హత్య కలకలం..!
ఇక్కడ ర్యాంప్ వాక్ చేసింది. అయితే ఈ షోకు ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ కూడా వచ్చాడు. ఓ పక్క నటాషా ర్యాంప్ వాక్ చేస్తుండగా.. హార్థిక్ కొడుకును అలెగ్జాండర్ ఆడిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా ఆమెను తిట్టి పోస్తున్నారు. ఈ ఫ్యాషన్ షోకు కొడుకును ఎందుకు తీసుకొచ్చావ్.. అది కూడా నీ బాయ్ ఫ్రెండ్ తో అంటూ ఆమెకు చురకలు అంటిస్తున్నారు. అయితే ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. తనకు తిరిగి సినిమాల్లో నటించాలని ఉందని.. ఏమైనా ఛాన్సులు వస్తే తప్పకుండా చేస్తాను అంటూ చెప్పింది.