NTV Telugu Site icon

Naslen Gafoor: మహేష్ బాబు,ప్రభాస్ సరసన మలయాళ కుర్ర హీరో..

Naslen K Kafoor

Naslen K Kafoor

Naslen K Gafoor in Wikipedias Top 10 Most Viewed South Indian Actors february: గత నెల, ఫిబ్రవరిలో, వికీపీడియాలో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాలో ప్రేమలు హీరో నాస్లిన్ ఉండడం హాట్ టాపిక్ అయింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పది మంది స్టార్స్ లో, నాస్లిన్ మూడవ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ హీరేమో విజయ్ మొదటి స్థానంలో ఆ తరువాతి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇక నాస్లిన్ కి ఈ లిస్టులో స్థానం దక్కించుకోడానికి ‘ప్రేమలు’ సినిమా ఘనవిజయం సాధించడమే కారణం. ఇక తన రణానికి సంబంధించిన ఫేక్ న్యూస్‌తో వివాదం సృష్టించిన పూనమ్ పాండే వికీపీడియాలో ఫిబ్రవరి నెలలో అత్యధికంగా వీక్షించిన వికీపీడియా పేజీగా నిలిచింది. ఇక ఇండియన్ నటీమణుల్లో ఆలియా భట్‌ అగ్రస్థానంలో ఉంది.

Darsini Movie: సోషియా ఫాంటసీ కథతో రాబోతున్న దర్శిని..

హృతిక్ రోషన్ ఫిలిం ఫైటర్ సినిమాల కోసం అత్యధికంగా శోధించిన వికీపీడియా పేజీగా నిలిచింది. ఇక మమ్ముట్టి, ప్రభాస్, ధనుష్, రజనీకాంత్, కమల్ హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు శివకార్తికేయన్ దక్షిణ భారత నటుల టాప్ టెన్ లో ఉన్నారు. ఇక ప్రేమలు సినిమాలో నస్లెన్ మమితా హీరోహీరోయిన్లుగా నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా థియేటర్లలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ప్రేమలు బాక్సాఫీస్ విజయోత్సవం కొనసాగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లు కూడా విడుదలై మంచి రివ్యూలను అందుకుంది. ప్రేమలు ఇప్పుడు OTT విడుదలకు సిద్ధమవుతున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రేమలు రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. OTTలో ప్రేమలు ఎప్పుడు విడుదలవుతుంది అనేది అధికారికంగా ప్రకటించనున్నారు.