NTV Telugu Site icon

Narne Nithin: ఎన్టీఆర్ బావ.. మ్యాడ్ సినిమా చూసి ఏమన్నాడంటే.. ?

Ntr

Ntr

Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా మ్యాడ్ సినిమాకు కొద్దోగొప్పో హైప్ తీసుకొచ్చింది నార్నే నితిన్. ఎన్టీఆర్ బావమరిది. ఎన్టీఆర్ భార్య ప్రణతి తమ్ముడు కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా మ్యాడ్ ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదనే రిలీజ్ చేసి మరింత హైప్ వచ్చేలా చేశారు.

Suhas: ఏదైమైనా సుహాస్ తెలివి.. ఆర్. నారాయణమూర్తికే సారీ చెప్పి..

ఇక సినిమాలో నితిన్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. డ్యాన్స్, ఫైట్స్ బాగానే హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ ఏమన్నాడో నితిన్ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ” ఈ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే. కళ్యాణ్ అన్న ఇంకా చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టాలి. ఆ హిట్లలో మేము ఉండాలి. ఈ సినిమాని మా అక్క(లక్ష్మి ప్రణతి), బావ(ఎన్టీఆర్) చూశారు. బావకి సినిమా చాలా నచ్చింది. అక్కకి డబుల్, ట్రిపుల్ నచ్చింది. పిల్లలైతే నితిన్ మామ.. నితిన్ మామ అంటూ బాగా ఎంజాయ్ చేశారు. డైరెక్టర్ ని, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వంశీ అన్నకి, హారికకి, చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్” అంటూ చెప్పుకొచ్చాడు.

Show comments