బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ కఠిన నిర్ణయం తీసుకున్నది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ‘రాక్‌స్టార్’ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ మొదటి సినిమాతోనే హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని బిజీగా మరీనా అమ్మడు సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా .. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, దానివలన పని సరిగా చేయలేకపోతున్నట్లు అనిపించందని చెప్పుకొచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న నర్గీస్ మాట్లాడుతూ ” నేను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. వరుస సినిమాలను చేస్తూ ఫ్యామిలీకి , ఫ్రెండ్స్ కి దూరం అవుతున్నట్లు అనిపించింది. ఇక దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను. అందుకే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను. అయితే నా నిర్ణయాన్ని సినిమా ఇండస్ట్రీలో వారు చాలామంది అంగీకరించలేదు. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్లీ రావాలనుకున్నా రాలేవు. అవకాశాలు అప్పుడు రావు అంటూ నన్ను భయపెట్టారు. కానీ నేను ఏమంటాను అంటే మీకోసం మీరు సమయం కేటాయించుకున్నప్పుడు కోల్పోయేదేమీ ఉండదు. విజయం దానంతటదే వస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం నర్గీస్ తెలుగులో పవన్ సరసన హరిహర వీరమల్లులో నటిస్తున్న సంగతి తెలిసిందే.
