NTV Telugu Site icon

Naresh: పెళ్లి చేసుకున్నవారు ఎవరు హ్యాపీగా లేరు.. మేము పెళ్లి చేసుకోలేదు

Naresh

Naresh

Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. ఇప్పుడు వీరి ప్రేమ.. తెరపై కనిపించనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 26 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. నేడు బెంగుళూరు లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రెస్ మీట్ లో నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజం చెప్పాలంటే.. కన్నడ ప్రెస్ మీట్ అంటే అక్కడ వారికి కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి ఉంది. ఎందుకంటే పవిత్రా లోకేష్ కన్నడ నటి. అక్కడ నుంచే ఆమె తెలుగుకు వచ్చి సెటిల్ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ప్రెస్ మీట్ లో నరేష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Krithi Shetty: ‘ఉప్పెన’ తరువాత ప్లాస్టిక్ సర్జరీ.. బేబమ్మ ఏం చెప్పిందంటే..?

“సుప్రీమ్ కోర్ట్ తీర్పు నాలాంటి వాళ్ళకి విడాకులపై ఎంతో ఊరటనిచ్చింది. సహజీవనాన్నికి, పెళ్ళికి సంబంధం లేదని, అది వారి పర్సనల్ లైఫ్ అని చెప్పింది. నాలాంటి వాళ్లకు ఈ సుప్రీం తీర్పు ఎంతో ఊరటను ఇచ్చింది. హైదరాబాద్ లో 6 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి అంటే చాలా ఫ్యామిలీలు హ్యాపీ గా లేవు. పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరు హ్యాపీగా లేరు. ఇక మా విషయానికొస్తే.. పవిత్ర మనసు. నా మనసు కలవడం తో మేము కలిసి ఉన్నాం. ఇప్పటివరకు మేము పెళ్లి చేసుకోలేదు.. కానీ, త్వరలో చేసుకుంటాం.. అందుకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఇక మళ్లీ పెళ్లి సినిమా విషయానికొస్తే.. అది నా బయోపిక్ కాదు. ట్రైలర్ చూసి అంచనాలు వేయకండి. సినిమా చూడండి.. మీ అందరికి తప్పక నచ్చుతుంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.