Site icon NTV Telugu

Mokshagna Nandamuri : బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

Mokshagna

Mokshagna

నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ అంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికపుడు వెనక్కి వెళుతూనే ఉంది. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురి డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి తప్ప అవేవి కార్యరూపం దాల్చలేదు.

Also Read : Deepika Padukone : దీపికా పడుకొనే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అయితే మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే దానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో అసలు మోక్షు ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడో చెప్పేసాడు యంగ్ హీరో నారా రోహిత్. ఈ హీరో నటించిన లేటెస్ట్ సినిమా సుందరకాండ. ఈ నెల 27న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నారా రోహిత్. ఈ సందర్బంగా మోక్షు ఎంట్రీ గురించి రోహిత్ ను మీడియా ప్రశ్నించింది. అందుకు బదులుగా రోహిత్ స్పందిస్తూ ” నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉంటుంది. తన తొలి సినిమా కోసం ఒక ప్రేమ కథ అయితే బాగుంటుందని అలాంటి కథ కోసం చూస్తున్నానని మోక్షజ్ఞ నాతో చెప్పాడు’ అని అన్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ అనే చెప్పాలి

Exit mobile version