Site icon NTV Telugu

Napoleon Returns : ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ రిలీజ్..

Nepoleon Returns

Nepoleon Returns

Napoleon Returns : ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ‘నెపోలియన్ రిటర్న్స్’ సినిమా గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భోగేంద్ర గుప్త నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఆనంద్ ర‌వి తీసిన నెపోలియ‌న్, ప్ర‌తినిధి, కొరమీను సినిమాలు ఎంత పాపులర్ అయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతో మరోసారి ఆనంద్ రవి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు.

Read Also : Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్

‘నెపోలియన్’ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ లో ఆనంద్ ర‌వి ఇద్ద‌రితో క‌లిసి పోలీస్ స్టేష‌న్‌కు కంప్లైంట్ ఇవ్వ‌టానికి వెళ్తాడు. ఓ గేదె ఆత్మ స‌మ‌స్య‌గా మారింద‌ని కంప్లయింట్ ఇస్తాడు. పోలీస్ ర‌ఘుబాబు స‌హా అంద‌రూ ఆ గేదె ఆత్మ గురించి మ‌రింత స‌మాచారం తెలుసుకోవాల‌నుకుంటారు. ఇంట్లో క‌నిపించే పుర్రె ఓ చిన్నారిద‌ని చెప్ప‌టంతో ఇదే సరికొత్త హార‌ర్ స‌స్పెన్స్ మూవీ అనే భావన క‌లుగుతుంది. గ్లింప్స్ చివ‌ర‌లో ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఆనంద్ ర‌వితో ఇంత‌కు ముందే నువ్వే క‌దా నీడ పోయింద‌ని కంప్లైంట్ ఇచ్చావ్ అని అడ‌గ‌టంతో నెపోలియ‌న్ సినిమా రెఫ‌రెన్స్‌ను అక్క‌డ రివీల్ చేశారు. ఈ సినిమా విజువల్స్ చాలా రిచ్ గా సస్పెన్సివ్ గా అనిపించాయి. బీజీఎం కూడా ఆకట్టుకుంటోంది. ఆనంద్ ర‌వి, దివి వద్త్య, ఆటో రామ్ ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌, యాంక‌ర్ ర‌వి, ర‌వి వ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు ఇందులో న‌టించారు.

Read Also : Naga Vamsi : కింగ్ డమ్ ప్లాప్ కాదు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్

Exit mobile version