నేచురల్ స్టార్ నాని నటించిన “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. “టక్ జగదీష్” రిలీజ్ అవ్వడంతో “నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్ ప్రకారం దర్శకుడు సుకుమార్ కు మాజీ అసిస్టెంట్ అయిన శ్రీకాంత్ డైరెక్టర్ గా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకాంత్ తోనే నాని నెక్స్ట్ మూవీ అంటున్నారు. నాని కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గానే కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత “అష్టా చెమ్మా”తో హీరోగా టర్న్ అయ్యాడు. శ్రీకాంత్, నాని చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “దసరా” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. టైటిల్ చూస్తుంటే ఈ సినిమాకు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్పిస్తోంది. ఈ సినిమాలో మొదటిసారి నాని తెలంగాణ యాస మాట్లాడబోతున్నాడు. మరి నిజంగానే నాని “దసరా” పండగ చేయబోతున్నాడా ? అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Also : ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా రాజమౌళి, కొరటాల
ఇక శ్రీకాంత్, నాని కాంబోలో ప్రాజెక్ట్ అనే వార్త ఇప్పటిది కాదు. నాని “దేవదాస్” సినిమా చేస్తున్నప్పటి నుంచి చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక శ్రీకాంత్ దర్శకత్వంలో నాని అన్నారు. కానీ నాని మాత్రం గౌతమ్ తిన్ననూరి “జెర్సీ” మొదలుపెట్టాడు. జెర్సీ తర్వాత విక్రమ్ కుమార్ “గ్యాంగ్ లీడర్” అయ్యాడు నాని. అనంతరం శైలేష్ కొలను, విశ్వక్ సేన్, రుహాని శర్మల “హిట్” మూవీకి నిర్మాతగా మారాడు. నెక్స్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి “వి”లో కన్పించాడు. ఇప్పుడు “టక్ జగదీష్”. ఈ సినిమా కూడా విడుదలవడంతో ఇప్పటికి శ్రీకాంత్ ప్రాజెక్ట్ కు సమయం దొరికింది అంటున్నారు. మరి ఇప్పటికైనా వీరిద్దరి ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా ? లేదా అన్నది చూడాలి.
