Site icon NTV Telugu

Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?

Nani

Nani

Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు. అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఖైదీ-2ను చేస్తున్నాడు.

Read Also : CM Chandrababu: స్పేస్ పాలసీపై సీఎం సమీక్ష..

ఇప్పుడు తమిజ్ డైరెక్షన్ లో భారీ సినిమా చేయబోతున్నాడు. ‘కార్తీ-29’ వర్కింగ్ టైటిల్‌తో మూవీని తీస్తున్నాడు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంట. హిట్-3లో కార్తీ మంచి రోల్ చేశాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే కార్తీ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడంట.

ఈ సినిమాను 1960 బ్యాక్ డ్రాప్‌లో రామేశ్వరం తీరం నేపథ్యంలో స్మగ్లింగ్ ఫ్లాట్ ను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ సినిమాగా రాబోతోంది. జులై నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..

Exit mobile version