The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani The Paradise Day 1 Collections: ‘దసరా’ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన మరో మాస్ మూవీ ‘ది ప్యారడైజ్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ వంటి సాంగ్స్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్యారడైజ్ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజు కలెక్షన్లు కలిపి రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో నాని కెరీర్లోనే ఇది ఆల్‌టైమ్ హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, ఇతర భాషల మార్కెట్లలోనూ ప్యారడైజ్ మూవీకి మొదటిరోజు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోల నుంచే థియేటర్లు ప్రేక్షకులతో సందడిగా మారాయి. పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.
Also Read
- Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
- Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
- Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
ముఖ్యంగా నైజాం ఏరియాలో ది ప్యారడైజ్ హవా స్పష్టంగా కనిపించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ మార్కెట్లలోనూ సినిమా మంచి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా టాక్ మాత్రం కాస్త డివైడ్‌గా ఉంది. అయినప్పటికీ సినిమాకు ఉన్న భారీ హైప్, వీకెండ్‌కు చేరుకోవడం, అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన రావడం వంటి అంశాలు కలెక్షన్లకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ప్యారడైజ్ నాని కెరీర్లోనే భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. నాని కెరీర్లో ఈ సినిమా కొత్త బాక్సాఫీస్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!