‘ఆహా’ సెలబ్రిటీ చాట్ షో “అన్స్టాపబుల్”తో ఓటిటి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణకు తాజా ఎపిసోడ్ లో నాని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. “అన్స్టాపబుల్” మొదటి రెండు ఎపిసోడ్లకు మంచి స్పందన లభించింది. మంచు కుటుంబం తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైన నేచురల్ స్టార్ నాని బాలయ్యతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. షో మధ్యలోనాని బాలకృష్ణకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. మొదట్లో బాలయ్య ఆ అమ్మాయిని గుర్తు పట్టలేదు. దీంతో నాని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ సహాయంతో ఆ అమ్మాయికి చికిత్స జరిగిందని చెప్పాడు.
Read Also : పూజా కార్యక్రమాలతో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్
కొన్నేళ్ల క్రితం తన ద్వారా సహాయం పొందిన చిన్నారిని ఇన్నేళ్ల తరువాత కలుసుకున్నందుకు బాలకృష్ణ సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత ఆమెను కలిసిన బాలకృష్ణ కొద్దిసేపటికే ఆమెను గుర్తు పట్టి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఈ ఎపిసోడ్ చూసిన అభిమానులు “ఎప్పుడో 2011 జరిగిన సంఘటన ఇవ్వాళ నాని గారు చెప్తే తప్ప బయటకు రాలేదు. ఇలా ఆయన నిలబెట్టిన ప్రాణాలు ఎన్నో. చేసిన సహాయాన్ని ఎవరికీ తెలియనివ్వడు. తన సహాయం వల్ల ఒక జీవితం బాగుపడితే అది చాలు అని సంతోషిస్తాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “అన్స్టాపబుల్” మొదటి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, ప్రభాస్, ఎన్టీఆర్ ఈ షోలో కన్పించబోతున్నారని టాక్ నడుస్తోంది.