పూజా కార్యక్రమాలతో బాలయ్య నెక్స్ట్ మూవీ లాంచ్

నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్‌ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్‌ని టీమ్‌కి అందజేశారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ కు ఇంతా టైటిల్ ఖరారు చేయలేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో రూపొందించనుంది. దర్శకుడు స్క్రిప్ట్‌ను బాగా అధ్యయనం చేసి బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్, నవీన్ నూలి ఎడిటర్‌, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2022 నుండి ప్రారంభం కానుంది.

Image
Image
Image

Related Articles

Latest Articles